జబర్దస్త్ అనగా గుర్తొచ్చేది ముఖ్యంగా సుధీర్ అనే చెప్పుకోవాలి. ఆ షో ద్వారా సుధీర్హీరో స్థాయికి వెళ్లాడని చెప్పుకోవాలి. ఎంతలాగ అంటే, తనకోసం తెలుగునాట కొన్ని అభిమాన సంఘాలు తయారు అయ్యాయి అనేంతలా. ఇక ఇండస్ట్రీలో కమెడియన్స్ గా కూడా గుర్తింపు అందుకోలేని వారు సైతం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి జనంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. తద్వారా సినిమా అవకాశాలు కూడా వచ్చినవారు కూడా వున్నారు. అయితే ఎందరి ఎన్ని అవకాశాలు వచ్చినా, సుధీర్ స్థాయి వేరు. ఎందుకంటే వరుస హీరో అవకాశాలు దక్కించుకుంటుంది మాత్రం సుధీర్ అనే చెప్పుకోవాలి.
 
ఇకపోతే, జబర్దస్త్ షో ద్వారా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉంటాడు. సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను ఆటో రామ్ ప్రసాద్ ఈ ముగ్గురూ కూడా చాలా మంచి టైమింగ్ తో జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ లో ఉండగా.. సుధీర్ రెమ్యునరేషన్ గురించి చర్చలు మంచి జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే ఇంతవరకు సుధీర్ ఎక్కడ కూడా నాకు ఇంత ఇస్తారు అని ప్రస్తావించిన దాఖలాలు లేవు. కానీ మీడియా వారు మాత్రం కొన్ని ఊహాగానాలతో ఇంత అని రాసేస్తున్నారు.
 
ఇకపోతే, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ అంటే ప్రేక్షకులకు మంచి గురి. వీరి షోకు అందరికంటే ఎక్కువగా TRP రేటింగ్ వస్తుందని భోగట్టా. ఈ టీమ్ కి చెందినటువంటి గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఇద్దరికి కూడా ఒకే తరహా రెమ్యునరేషన్స్ అందుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో ఎపిసోడ్ కి గాను 3 లక్షలకు పైగానే ఇస్తున్నట్లు టాక్. ఇక స్క్రిప్ట్ లో కూడా టీమ్ కు ఎంతగానో హెల్ప్ అవుతున్న ఆటో రామ్ ప్రసాద్ కు కూడా దాదాపు 2 లక్షలకు పైగా ఇస్తున్నట్లు సమాచారం. కేవలం జబర్దస్త్ ద్వారానే కాకుండా సుడిగాలి టీమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే ఢీ షో ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: