ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించి కొన్ని వార్తలు కూడా రావడం జరిగేది ఇక రామ్ చరణ్ పాత్ర పై కూడా పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఏకంగా త్రిబుల్ రోల్ లో కనిపించనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వైరల్ అవుతుంది ఒక వీడియోలో ఈ వార్తలకు బలం చేకూర్చిందని చెప్పవచ్చు.. రామ్ చరణ్ కొత్త లుక్కుకు సంబంధించి తాజాగా వీడియో ఒకటి అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
ఈ వీడియోలో రామ్ చరణ్ మేకప్ మ్యాన్ హెయిర్ స్టైల్ చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఇక లాంగ్ హెయిర్.. గడ్డంతో ఉన్న రామ్ చరణ్ సరికొత్త లుక్ లో నేటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన సమయంలో విడుదల చేసిన పోస్టల్ రామ్ చరణ్ ను ఒక క్లాస్ లుక్ లో కనిపించారు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలో కనిపిస్తున్న ఫోటోను చూస్తే మాత్రం రఫ్ లుక్ లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై రామ్ చరణ్ ఒకటి కంటే ఎక్కువ పాత్రలో నటించబోతున్నారని వార్త మరింత బలం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా అవుతోంది.