సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలలో నటించి వాటితో అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఈ మధ్యనే అదిరి పోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న మహేష్ బాబు ఆగస్ట్ నెల నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ ని ఆగస్ట్ నెలలో మొదలు పెట్టనున్నట్లు అలాగే మూవీ ని 2023 వేసవి లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చనుండగా, పూజా హెగ్డేమూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయం లోకి వెళితే మహేష్ , బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ ఆగస్ట్ నెల నుండి ప్రారంభం కాబోతుంది అని తెలిపిన చిత్ర బృందం ఏ తేదీ నుండి అనేది మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఆగస్ట్ 16 వ తేదీ నుండి మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోయే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: