వేణు తొట్టెంపూడి.. ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రారంభించిన వేణు తొట్టెంపూడి తన నటనతో ప్రేక్షకులకు తొందరగానే కనెక్ట్ అయిపోయాడు. అంతేకాదు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు అనే చెప్పాలి. సోలో హీరోగా నటించడమే కాదు ఎంతో మంది స్టార్ హీరోలతో కూడా కలిసి నటించి సూపర్ హిట్లు సాధించాడు. కానీ ఆ తర్వాత కాలంలో యువ హీరోలు జోరు పెరగడంతో ఒక వేణు తొట్టెంపూడి అవకాశాలు తక్కువ అయ్యాయి. అయితే ఇలాంటి సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టాడు ఈ హీరో.


 ఇలాంటి సమయంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూడు సినిమాల్లో ఒక కీలక పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. దమ్ము సినిమాలో కీలక పాత్రతో వేణు తొట్టెంపూడి మరోసారి బిజీ అవ్వడం ఖాయమని అభిమానులు కూడా భావించారు.  అయితే దమ్ము సినిమాలో వేణు తొట్టెంపూడి చేసింది కీలకపాత్ర అయినప్పటికీ కొద్దిసేపు మాత్రమే ఉండడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా వేణు తొట్టెంపూడి పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువ జూనియర్ ఆర్టిస్టుకు ఎక్కువ అంటూ అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన వేణు తొట్టెంపూడి ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తో రీ ఎంట్రీ  ఇచ్చాడు.

 అయితే ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దమ్ము సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా వేణుకి పాత్ర గురించి వివరించే ముందు.. షోలే సినిమాలో అమితాబ్ లాంటి పాత్ర నీది అంటూ దర్శకుడు బోయపాటి బోయపాటి వేణుకి చెప్పాడట. అయితే అప్పటికే బోయపాటికి  మంచి హిట్స్ కూడా ఉండడంతో మంచి పాత్రను డిజైన్ చేసి ఉంటారని వేణు కూడా నమ్మేసాడట. ఆ తర్వాత ఎన్నో కీలకమైన సీన్లు కూడా వేణూతో తీశారు. కానీ ఎడిటింగ్లో అవన్నీ తీసేశారట. ఇక తీరా సినిమాలో చూశాక దమ్ము సినిమాలో తన పాత్రకు దమ్ము లేకుండా పోయింది అని అర్థమైందట. అయితే ఈ సినిమాలో నటించినందుకు నేనేమి ఫీల్ కాలేదని కెరియర్లో  ఇలాంటివన్నీ సహజం అంటూ చెప్పుకొచ్చాడు వేణు తొట్టెంపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: