త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మ్యాజిక్ తో సగటు ప్రేక్షకులు మాత్రమే కాదు టాప్ హీరోలు కూడ ఆయన మ్యాజిక్ కు ప్రభావితులు అవుతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న త్రివిక్రమ్ తన కలం పవర్ తో ప్రస్తుతం కోట్లు గణిస్తున్నాడు. ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరొకవైపు తన పెన్ మ్యాజిక్ తో కొన్ని సినిమాలకు సంభాషణలు వ్రాస్తూ తన హవా కొనసాగిస్తున్నాడు.


త్రివిక్రమ్ మైండ్ అంతా అనేక క్రియేటివ్ ఆలోచనలలో ఉంటుంది. అందువల్లనే సినిమా దర్శకుడుగా మాత్రమే కాకుండా యాడ్ దర్శకుడుగా కూడ త్రివిక్రమ్ రాణిస్తున్నాడు. గతంలో మహేష్ అల్లు అర్జున్ లతో యాడ్స్ చేసిన త్రివిక్రమ్ కు మరొకసారి అటువంటి యాడ్స్ చేసే అవకాశం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.


ఒక ప్రముఖ కన్జ్యూమర్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి త్రివిక్రమ్ త్వరలో అల్లు అర్జున్ తో ఒక యాడ్ ను చేయబోతున్నట్లు టాక్. ‘పుష్ప’ తో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడటంతో ఒక ప్రముఖ కార్పోరేట్ బ్రాండ్ అల్లు అర్జున్ తో ఒక యాడ్ ను తీయడానికి సన్నాహాలు చేస్తూ దానికి త్రివిక్రమ్ చేత దర్శకత్వం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యాడ్ సుమార్ ఒక నిమిషం ఉంటుందని అంటున్నారు.


కేవలం ఒకే ఒక్క నిముషం నిడివితో ఉండే ఈ యాడ్ ను దర్శకత్వం వహించడానికి ఆ ప్రముఖ కార్పోరేట్ సంస్థ త్రివిక్రమ్ కు 45 లక్షల పారితోషికం ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ తో త్రివిక్రమ్ రూపొందించ వలసిన సినిమా రకరకాల కారణాలతో ఆలస్యం అవుతున్నప్పటికీ త్రివిక్రమ్ రచయితగా కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ అందిస్తూ మధ్య మధ్యలో ఇలాంటి యాడ్స్ చేస్తూ దర్శకులలో తాను చాల విభిన్నం అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాతల సినిమా షూటింగ్ ల బంద్ నిజంగానే అమలు జరిగితే త్రివిక్రమ్ మహేష్ తో తీయబడే సినిమా మరింత ఆస్కారం ఉంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: