టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కొన్ని రోజుల క్రితం విడుదల అయిన థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  తాజాగా నాగ చైతన్య బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చడ్డా లో  ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించగా , కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది.

సినిమా ఆగస్ట్ 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నాగ చైతన్య కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని  ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజా ఇంటర్వ్యూ లో నాగ చైతన్య బాలీవుడ్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో నాగచైతన్య మాట్లాడుతూ ... గత కొన్ని సంవత్సరాలుగా నాకు బాలీవుడ్ సినిమాల నుండి అవకాశాలు వస్తున్నాయి అని, తాను పుట్టి పెరిగింది అంతా చెన్నై అని, ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కావడంతో తనకు పెద్దగా హిందీ టచ్ లేదు అని, అందుకే బాలీవుడ్ మూవీ ల నుండి వచ్చిన అవకాశాలు వద్దు అనుకున్నాను అని చెప్పాడు. అలాగే లాల్ సింగ్ చడ్డా మూవీ కి కూడా మొదట నో చెప్పాను అని, అయితే ఇందులో బాలరాజు క్యారెక్టర్ సౌత్ నుండి నార్త్ వెళ్లిన ఆర్మీ వ్యక్తి ఇతివృత్తంతో సాగుతుందని, అలానే భాగంగా స్టోరీ లో కొన్ని సన్నివేశాలలో తెలుగు డైలాగ్స్ గా వస్తాయని చెప్పడంతో ఈ మూవీ లో నటించడానికి ఒప్పుకున్నానన్నాను అని తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: