అల్లు అరవింద్ చివరికొడుకు అల్లు శిరీష్ కు క్రేజీ హీరోగా మారాలని కోరిక. ఈకోరిక నెరవేర్చుకోవడానికి శిరీష్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మూవీ తప్ప శిరీష్ నటించిన ఏసినిమా కనీసం ఏవరేజ్ టాక్ కూడ తెచ్చుకోలేక పోయింది. అయినప్పటికీ శిరీష్ హీరోగా సెటిల్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.


అల్లు అర్జున్ తమ్ముడుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోవాలని శిరీష్ తపన. జాతకాలను విపరీతంగా నమ్మే శిరీష్ తాను సక్సస్ ఫుల్ హీరోగా సెటిల్ అయ్యేరోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఏబీసీడీ’ మూవీ తరువాత అల్లు శిరీష్ ‘ప్రేమకాదంట’ అనే మూవీలో నటిస్తున్నాడు. అయితే ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.


ఇలాంటి పరిస్థితులలో శిరీష్ ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ తో ఒక సినిమాను చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇతడు శివ కార్తికేయన్ తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఈ సంవత్సరం దీపావళికి విడుదల అవుతుంది అంటున్నారు. ఈమూవీ విడుదల తరువాత అనుదీప్ తో ఒక సినిమాను చేసే ఉద్దేశ్యంతో శిరీష్ ఇప్పటికే అతడితో రాయబారాలు నడుపుతున్నట్లు టాక్.


అయితే అనుదీప్ మాత్రం ఒక క్రేజీ హీరోతో తన తదుపరి మూవీని చేయాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులలో శిరీష్ వ్యూహాలు ఎంతవరకు అనుదీప్ దగ్గర వర్కౌట్ అవుతాయి అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. అల్లు కాంపౌండ్ సప్రోట్ ఉన్న ప్పటికీ శిరీష్ కు సరైన హిట్ ఇవ్వగల ఒక దర్శకుడు ఇప్పటికీ లభించకపోవడం ఒక విధంగా అసంతృప్తిని కలిగించే విషయమే అనుకోవాలి. శిరీష్ తన చిన్నతనంలో అల్లు అర్జున్ ఆడుకున్న బొమ్మలను శిరీష్ కు ఆడుకోమని ఇచ్చేవారట. తనకు కొత్తబొమ్మలను కొనిపెట్టమని అడిగినా మట్టించుకునే వారు కాదట. దీనితో ఆనాడే శిరీష్ బన్నీ తమ్ముడుగా కాకుండా తనకు తానుగా ఎదగాలని ఆనాడే గట్టి సంకల్పంతో ఉండి ఉంటాడు..మరింత సమాచారం తెలుసుకోండి: