ఇక టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలామంది కూడా భయపడతారు. మోహన్ బాబు అంటే ముక్కు సూటిమనిషి. ఇంకా అటువైపు ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద దర్శకుడు,నిర్మాతలు ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేస్తుంటారు. ఈ విషయంలో ఆయన ఎంతమందికి శత్రువు అవుతున్నా కూడా తన తీరు మాత్రం అస్సలు మార్చుకోరన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. మోహన్ బాబు పక్కన ఆయన సొంత సినిమాలలో నటించే నటీనటులు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు.మోహన్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే ఉదయం చెప్పిన ఎంత పెద్ద స్టార్ అయినా కూడా టైంకు కచ్చితంగా సెట్లో ఉండాల్సిందే.ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు..ఇతను విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2003 వ సంవత్సరంలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఇంకా ఇస్మాయిల్ దర్బార్ మ్యూజిక్ అందించారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఉన్న సాక్షి శివానంద్ సోదరి శిల్ప శివానంద్ నటించింది.


ఇంకా ఇదే ఆమెకు తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్లో హీరోయిన్ శిల్ప శివానంద్‌ దర్శకుడిని పదేపదే ఇబ్బంది పెడుతుండడంతో షాజీ కైలాస్ చాలాసార్లు  కూడా ఓపిక పట్టి మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కూడా ముందు కాస్త ఓపిక పట్టిన తర్వాత శిల్ప శివానంద్ చాలా అతిగా ప్రవర్తించడంతో ఆమెపై చేయి చేసుకోవడంతో పాటు ఇంకా చెంప మీద కొట్టారన్న టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద హార్ట్ టాపిక్ గా కూడా మారింది. శిల్పా శివానంద్‌ ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆమె దురుసు ప్రవర్తన వల్లే ఇలా పెద్ద గొడవ జరిగిందని.. దర్శకుడు చెప్పినట్టు కాకుండా ఆమెకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుండడంతోనే మోహన్ బాబుఆమెకు వార్నింగ్‌ ఇచ్చారని ఆ సినిమా వర్గాలు చెప్పాయి. అయితే శిల్పా సోదరి సాక్షి శివానంద్ కూడా మోహన్‌బాబుకు జోడీగా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: