టాలీవుడ్ హీరోగా నిర్మాతగా కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. తాజాగా మరొకసారి బింబి సార సినిమాతో కూడా అలాంటి ప్రయోగమే చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి ప్రశంసలు దక్కించుకుంటోంది. కళ్యాణ్ రామ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వసూళ్లపరంగా మంచి కలెక్షన్లను రాబడుతోంది. నూతన డైరెక్టర్ అయిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.


వరుసగా సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి ప్రశంసించడం కూడా జరుగుతుంది తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాని చూసి బింబి సార సినిమా బృందంపై ట్విట్టర్లో పొగడ్తల వర్షాన్ని కురిపించారు. కళ్యాణ్ రామ్ అంటే తనకు ఎంతో గౌరవం అని అల్లు అర్జున్ తెలియజేశారు.బింబి సార బృందానికి కూడా విషెస్ తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన విషయాన్ని కూడా తెలిపారు. ఈ సినిమా ఒక ఫాంటసీ సినిమా ఇది కళ్యాణ్ రామ్ గారి ప్రభావంతమైన ఊనికిని చాటడానికి ఈ సినిమా చాలు.. ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ.. కొత్త తరహాలో ఏదో ఒక విధంగా ట్రై చేస్తూ ఉంటారు అందుచేతనే ఆయనంటే నాకు చాలా గౌరవమని తెలిపారు. ఇక ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేసినందుకు డైరెక్టర్ వశిష్ఠను కూడా అభినందించారు.


ఇక ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ కు కీరవాణి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లను కూడా ప్రశంసిస్తూ ఈ చిత్రం అన్ని వయసులో వారికి కూడా వినోదాన్ని ఇస్తుందని ప్రశంసించడం జరుగుతోంది. చిరంజీవి అల్లు అర్జున్ తో సహా పలువురు స్టార్లు సైతం కళ్యాణ్ రామ్ను ప్రశంసించడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: