ప్రస్తుతం ఇప్పుడు అక్కినేని హీరోలు మరో మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తుంది.. అయితే ఎప్పటిలాగా ఈసారి నాగ చైతన్య- నాగార్జున కాకుండా నాగార్జున- అఖిల్ కలి సి మల్టీ స్టారర్ చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..ఇకపోతే ఈ మల్టీ స్టారర్ కు కర్త కర్మ క్రియ మెగాస్టార్ అని వార్త షికారు చేస్తుంది. అయితే మెగాస్టార్ కు నాగార్జున కు మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెలుసు వారి స్నాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక వీరి స్నేహం కారణంగానే చిరు చెప్పాడని..

 నాగ్ మల్టీ స్టారర్ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం.. అయితే అది కూడా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఇక మోహన్ రాజా ప్రెజెంట్ చిరంజీవి తో గాడ్ ఫాథర్ సినిమా చేస్తున్న విషయం విదితమే..ఇకపోతే  ఈ క్రమంలోనే అక్కినేని మల్టీ స్టారర్ కథ విషయంలో కూడా చిరు కీలక పాత్ర పోషించినట్టు కథనాలు వస్తున్నాయి.అయితే మోహన్ రాజా చిరుకి స్టోరీ లైన్ చెప్పగా ఆయన అక్కినేని నాగార్జున, అఖిల్ అయితే బాగుంటారు అని సజెస్ట్ చేయగా ఈ మల్టీ స్టారర్ ఓకే అయ్యిందట..

ఇక అంతేకాదు ఇప్పుడు మరొక వార్త వైరల్ అయ్యింది.ఇదిలావుంటే  నాగార్జున-అఖిల్ కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ సినిమాను చిరంజీవి నిర్మాతగా మారి నిర్మించ బోతున్నట్టు టాక్ బయటకు వచ్చింది.అయితే మోహన్ రాజా ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ స్టోరీ రెడీ చేసినట్టు ఇప్పటికే ఈ అక్కినేని హీరోలకు వినిపించినట్టు కూడా టాక్.. పోతే ఈ కథ బాగుండడంతో అక్కినేని హీరోలు వెంటనే ఓకే చెప్పారట.. ఇక ఈ సినిమా అనుకున్నట్టు పట్టాలెక్కితే మెగాస్టార్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇకపోతే చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: