సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానుల సైతం సెలబ్రేషన్స్ చేయడం జరిగింది ఇక సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా ఎవరు ప్రకటించలేదు అయినా కూడా అభిమానులు నిరాశ తో ఉండకుండా పోకిరి సినిమా స్పెషల్ షో తో సందడి చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పోకిరి సినిమాలను ప్రదర్శించడం జరిగింది. ఇక రికార్డ్ స్థాయిలో దాదాపుగా 400కు పైగా షోలు నిర్వహించారు. ఇంతవరకు ఇండియన్ సినిమాకు ఇన్ని షోలు వేయలేదని చెప్పవచ్చు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.


ఇక పోకిరి చుట్టూ ఇంత హంగామా జరుగుతూ ఉన్నప్పటికీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం ఈ విషయంపై ఏవిధంగా మాట్లాడకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలు ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే గతంలో మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ కు విభేదాలు ఉన్నట్టుగా సమాచారం అందుచేతను ఈ వేడుకలను అసలు పట్టించుకోలేదు అంటూ అభిమానుల సైతం ఆరోపిస్తున్నారు. ఇక టాలీవుడ్లో మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మంచి సక్సెస్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

పోకిరి బిజినెస్ మాన్ ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను సైతం తిరగరాసాయి. అయితే గడిచిన దశాబ్దం నుండి వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు వాస్తవానికి మహేష్ పూరి జగన్నాథ్ కలయికల జనగణమన అనే సినిమా టైటిల్ ని ప్రకటించారు కానీ ఈ ప్రాజెక్టుపై ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో దర్శక హీరోల మధ్య కాస్త దూరం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక ఈ హిట్టు కాంబో కోసం మహేష్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూశారు ఈ నేపథ్యంలోనే మహేష్ హిట్స్ లో ఉంటే డేట్లు ఇస్తాడని.. లేదంటే లేదని ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నా తెలిపారు. దీంతో అభిమానుల సైతం ఈ సినిమా పైన ఆశ వదులుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ మహేష్ బాబు పుట్టినరోజు కు విషెస్ కూడా తెలియజేయలేదు దీంతో వీరిద్దరి మధ్య ఇంకా విభేదాలు ఉన్నట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: