పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగు తున్నారు . ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస విజయా లతో ఫుల్ జోష్ లో ఉన్న సమయం లో బద్రి మూవీ తర్వాత కొన్ని సినిమాల ద్వారా అపజయాలను ఎదుర్కొన్నాడు . అలాంటి సమయం లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన జల్సా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అనుకున్నారు . జల్సా మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా , పార్వతి మెల్టన్ హీరోయిన్ లుగా నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు . 

మూవీ లో పవన్ కళ్యాణ్ తన బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ  తో ప్రేక్షకులను అలరించాడు . ఈ మూవీ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది . ఇలా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 4 కే వర్షన్ తో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన 500 థియేటర్ లలో ఈ మూవీ ని విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: