సినిమా ఎంత బాగా తెరకెక్కించినప్పటికీ  ఆ సినిమాకు నిర్వహించే ప్రమోషన్స్ ని బట్టి ఆ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే ప్రమోషన్స్ కారణంగానే సినిమా ప్రేక్షకుల్లోకి ఎక్కువగా దూసుకు పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా విడుదల అవుతుందంటే చాలు ఇక సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రమోషన్ తో బిజీగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో బుల్లితెరపై ఎక్కడ చూసిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ టీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు సినిమా ప్రమోషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.


 స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ఇక అందరూ ఇలాంటి ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. కాగా సుడిగాలి సుదీర్ ప్రధాన పాత్రలో నటించిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా  మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో సునీల్ అనసూయ లాంటి వారు కీలక పాత్రలో నటించడం గమనార్హం. ప్రస్తుతం సినిమా బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన క్యాష్ ప్రోమో ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఒకసారి ఈ ప్రోమో చూసుకుంటే విష్ణు ప్రియా, యశ్వంత్ మాస్టర్, అనసూయ, రాఘవేంద్రరావు, నిత్య శెట్టి పాల్గొని సందడి చేశారు అని చెప్పాలి. అయితే షో లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో రాఘవేంద్రరావు ఏకంగా అనసూయ చేతిలో చేయి వేసుకుని ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అనసూయ చేతిలో చేయివేసి ఎందుకు వచ్చానో తెలుసా అని అడుగగా.. అనసూయ మెట్లు ఎక్క లేదు కాబట్టి మీరు సహాయం చేస్తున్నారు అంటూ పంచ్ వేస్తుంది సుమ. అది కాదు అసలు విషయం ఏంటంటే కాలేజీ లో అనసూయ అనే అమ్మాయి ఉండేది ఆమె స్థానంలో ఈ అనసూయ దొరకడంతో ఇలా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాను రాఘవేంద్రరావు అంటాడు.  అయితే అప్పట్లో సుమ పేరుతో ఎవరూ లేరు కదా అని యాంకర్ సుమ పంచు వేస్తుంది. నీ పెళ్లి చేసింది నేనే కదా అంటూ రాఘవేంద్రరావు చెప్పా.డు దీంతో వెంటనే స్పందించిన సుమ ఆ పాపం మాత్రం మీదే అంటూ పంచ్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: