టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో జక్కన్న తెరకెక్కించిన `RRR` సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గోండు బెబ్బులి కొమురం భీంల ఫిక్షన్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని ఎంతో విస్మయానికి గురిచేసింది.ఇక ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరపైకి రానున్న ఈ మూవీని సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్ ని కూడా తాజాగా రాజమౌళి ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించినట్టుగా తెలుస్తోంది.అత్యంత భారీ స్థాయిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం ప్రిపేర్ అవుతున్న జక్కన్న ఇప్పటికే భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది.


అయితే ఇక ఈ ప్రాజెక్ట్ ని అనుకున్న విధంగా పక్కా ప్రణాళిక ప్రకారం సెట్స్ పైకి తీసుకురావడం కుదరదని జక్కన్న చెప్పడం షాకిస్తోంది.ఇక ఈ మూవీని వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభిస్తానని స్పష్టం చేశారట. నిజానికి ఈ ఏడాది చివరలో స్టార్ట్ కావాల్సింది.అయితే ఇక ఇది పక్కాగా కుదిరేలా కనిపించడం లేదని చెబుతున్నారు. దానికి కారణం త్రివిక్రమ్  తో మహేష్ చేస్తున్న SSMB28 సినిమా అని తెలుస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అ మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి వుంది.కానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్ట్రెయిక్ వలన ఇంత వరకు అది జరగలేదు. అందుకే రాజమౌళి SSMB29 వచ్చే ఏడాది ప్రధమార్థంలో సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఇక SSMB28 సినిమాని ఏప్రిల్ 28 న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది SSMB29 సినిమాని స్టార్ట్ చెయ్యాలని మహేష్ భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: