చిరంజీవి తండ్రి కొణిదల వెంకట్రావ్ కు సినిమాల పై విపరీతమైన మోజు నటుడుగా రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తన తండ్రి కోరికను చిరంజీవి తీర్చడమే కాకుండా తెలుగు ప్రజలు గర్వించే నటుడుగా చిరంజీవి ఎదిగిపోయాడు.


తన తల్లితండ్రులు లానే చిరంజీవికి కూడ సినిమాల పై విపరీతమైన మోజు. దీనితో ఆరోజులలో విడుదలైన సినిమాలు అన్నింటిని చిరంజీవి వరసపెట్టి చూస్తూ ఉండేవాడు. సినిమాల వ్యామోహంతో చిరంజీవికి తరుచూ అతడి తండ్రి నుండి చివాట్లు దెబ్బలు తగులుతూ ఉండేవట. ఈవిషయానికి సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటనను చిరంజీవి ఈమధ్య ఒక ఫిలిం ఫంక్షన్ లో గుర్తుకు చేసుకున్నాడు.


తన చిన్నతనంలో తన తండ్రికి చెప్పకుండా సినిమాలకు వెళ్ళిన సందర్భాలు చాల ఉన్నాయి అని చెపుతూ ఒకసారి తన వద్ద డబ్బులు లేక నేల టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన విషయాన్ని తెలుసుకుని తన తండ్రి వెంకట్ రావ్ తనను కొబ్బరిమట్టతో చితక కొట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాము’ సినిమా విడుదల రోజున మొదటిరోజు మొదటి ఆటకు తాను నేల టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన విషయాన్ని తెలుసుకున్న తన తండ్రి కోపంతో ఊగిపోతూ తనను తరిమి తరిమి కొట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.


అంతేకాదు ఎన్టీఆర్ నటించిన ‘రాము’ సినిమా పేరు వినగానే ఇప్పటికీ తనకు భయం వేసి తన తండ్రి కొట్టిన దెబ్బలు గుర్తుకు వస్తాయి అని అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శకుల వద్దకు బస్సులో వెళ్ళడానికి డబ్బులు లేక రోజు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి అంటూ చిరంజీవి చెప్పిన మాటలను బట్టి మెగా స్టార్ ఎంత ఎదిగిన తన గతాన్ని మర్చిపోలేదు అనిపిస్తోంది అందుకే ఇప్పటికీ ఆయన టాప్ హీరో..



మరింత సమాచారం తెలుసుకోండి: