ఇక ఆ షోలో భాగంగానే హైపర్ ఆది మాట్లాడుతూ.. బేసిక్ గా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ మాట విన్నా, ఆయన పాట విన్నా నా నోటి నుంచి అరుపులు, వేళ్ళకు తెలియకుండానే విజిల్స్, చేతికి తెలియకుండానే చప్పట్లు వస్తూ ఉంటాయి అని హైపర్ ఆది వెల్లడించారు. ఇక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తర్వాత మళ్లీ ఆ స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కిరణ్ అబ్బవరం మాత్రమే అంటూ హైపర్ ఆది చెప్పుకు రావడం జరిగింది. ఇక ఈ విషయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా హైపర్ ఆది పై గుర్రుమంటున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు అని పవన్ ను దాటి వచ్చే వ్యక్తి ఎవరూ లేరు అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక పవన్ అభిమాని అయి ఉండి ఇలాంటి వివాదాస్పద కామెంట్లు నీకు అవసరమా అంటూ నేటిజెన్లు ఈయనపై కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్ను దేనితో కొట్టాలంటూ మరికొంతమంది ఆది పై విరుచుకుపడుతూ ఉండడం గమనార్హం. మరి ఈ వివాదం నుంచి హైపర్ ఆది ఎలా తప్పించుకుంటాడో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి