ఖైదీ నెంబర్ 150' వరకూ ఈ ట్రెండ్ ఆయన ప్రతి సినిమాకీ కొనసాగుతూ వచ్చింది. కానీ, 'ఖైదీ నెంబర్ 150' సినిమా తర్వాత సీన్ మారింది.దానికి కారణం ఆయన పెద్దకూతురు అని నేటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు...
ఫాన్స్ ట్రోలింగ్ చిరంజీవి ఎల్డస్ట్ డాటర్
అన్నట్టు, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఆయన కాస్ట్యూమ్స్, స్టైలింగ్ వ్యవహారాల్ని చూసుకోవడం ప్రారంభించారు 'ఖైదీ నెంబర్ 150' సినిమా నుంచే. అయితే, ఆ సినిమా వరకు కాస్ట్యూమ్స్, స్టైలింగ్ విభాగంలో పూర్తిస్థాయిలో ఛార్జ్ తీసుకోలేదు. కొంత మేర పని చేశారంతే.
'సైరా', 'ఆచార్య' దెబ్బకొట్టేశాయ్..
'సైరా' సినిమాకి సుస్మిత పూర్తిస్థాయిలో వర్క్ చేశారు.అయినా సరే ఈ సినిమాలో చిరంజీవి స్టైలింగ్ మీద చాలా విమర్శలొచ్చాయ్. అయినా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు సుస్మిత. ఇండస్ట్రీ లో ఇలాంటివి కామన్ అని విని వదిలేస్యారు సుస్మిత...కాస్ట్యూమ్స్, గెటప్స్.. అన్నీ తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చాయి. 'ఆచార్య' సినిమా పరిస్థితీ అంతే.
చిరంజీవి కుమార్తె కావడంతో దర్శకులు, ఆమె వర్క్ పట్ల అసహనం వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' సినిమా స్టైలింగ్ విషయంలో కూడా సుస్మిత మీద తీవ్ర విమర్శలే వస్తున్నాయి.అయినా అవేమి ఆమె పట్టించుకోదు...స్టైలింగ్ అస్సలు బాగా లేదని అభిమానులే అంటున్నారు.
'మీ నాన్నగారి మీద నీకు ఏమాత్రం గౌరవం వున్నా, వెంటనే కాస్ట్యూమ్స్ అలాగే స్టైలింగ్ విషయంలో చిరంజీవి జోలికి వెళ్ళొద్దు..' అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు. మరి, సుష్మిత ఈ విమర్శల్ని పరిగణనలోకి తీసుకుంటారా.? వేచి చూడాల్సిందే... దానికి సుస్మిత గారు అండ్ చిరంజీవి గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి