నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం కూడా మోస్ట్ క్రేజీ హీరోగా తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించాడు. ఈ రెండు పాత్రలలో కూడా బాలకృష్ణ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

దునియా విజయ్మూవీ లో విలన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఇలా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించడానికి రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 1 విజయవంతంగా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లో ఈ టాక్ షో సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇలా ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే బాలయ్య మరో టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: