బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ఫేమ్ వర్ష బోళ్లమ్మా హీరోయిన్ గా నటించగా ,  లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. స్వాతి ముత్యం మూవీ యూనిట్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సంబంధించిన అప్డేట్ ను ఇదివరకే ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేయనున్న ముఖ్య అతిథి గురించి అధికారిక ప్రకటన చేసింది. స్వాతి ముత్యం మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ,  ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే బెల్లంకొండ గణేష్ ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: