ఇప్పటికే ఎంతో మంది ఇండియన్ సినిమా హిస్టరీ లో కొరియోగ్రాఫర్ లుగా పనిచేసి ఆ తర్వాత దర్శకులుగా మారిన వారు ఉన్నారు. అందులో కొంతమంది కొరియోగ్రాఫర్ లుగా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యారో ... దర్శకులుగా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా అద్భుతమైన క్రేజీను సంపాదించుకున్న అమ్మ రాజశేఖర ఆ తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. అమ్మ రాజశేఖర్ ,  గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రణం మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అమ్మ రాజశేఖర్ కి దర్శకుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ లభించింది. అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత ఖతర్నాక్ , టక్కరి వంటి పలు మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే అమ్మ రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అమ్మ రాజశేఖర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ... నేను దర్శకత్వం వహించిన ఖతర్నాక్ మూవీ మంచి విజయం సాధించింది. దానితో నాకు ప్రభాస్ తో మూవీ చేసే అవకాశం వచ్చింది.

ప్రభాస్ మూవీ కి సంబంధించిన పనుల్లో ఉండగా ,  నితిన్ ఫోన్ చేసి టక్కరి మూవీ చేసి పెట్టమని అడిగాడు. టక్కరి మూవీ ఒక తమిళ్ ఫ్లాప్ సినిమాకి రీమేక్. నేను వద్దు అని చెప్పిన వినిపించుకోలేదు. నితిన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆ మూవీ చేశాను. అనుకున్నట్టు గానే టక్కరి మూవీ ఫ్లాప్ అయ్యింది. దానితో ప్రభాస్ ని మళ్లీ కలవకుండా అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ ని కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నితిన్ కోసం ఒక పెద్ద మూవీ చేసే ఛాన్స్ ని మిస్ చేసుకున్నాను.  నా కెరియర్ ను నేనే పాడు చేసుకున్నట్టు అయింది  అంటూ తాజా ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: