రికార్డులను తిరగరాసే హిట్ అవుతుంది అనుకున్న పొన్నియన్ సెల్వన్ 1 ఆ స్థాయిలో స్పందన దక్కించుకోలేకపోయింది. తమిళంలో అతి పెద్ద మల్టీ స్టారర్ కావడంతో అక్కడ ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి కానీ మనదగ్గర ఇంకా ఇతర భాషల్లో కొన్ని సిటీల్లో మినహాయించి మిగిలిన సెంటర్లలో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు కాలేదు.ఒకవేళ మూవీకి వచ్చిన టాక్ బ్రహ్మాండంగా వచ్చి ఉంటే పికప్ అయ్యేదేమో కాని ఈ రెండు రోజులు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప టార్గెట్ పెట్టుకున్న పది కోట్ల మార్కుని అందుకోవడం సులభం కాదు. విక్రమ్ కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అందుకోగలిగింది. ఒకవేళ పిఎస్ 1కు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చి ఉంటే అక్టోబర్ 5న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలకు ఇబ్బంది కలిగేది. థియేటర్ల కౌంట్ దగ్గర పంచాయితీ పడేది. కానీ ఇప్పుడా సమస్య లేదు. ఆ సమయానికి ఇది నెమ్మదించడం ఖాయం.


తక్కువ స్క్రీన్లున్న కేంద్రాల్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వేసుకోవడానికి రూట్ క్లియర్ అయ్యింది. ముఖ్యంగా స్వాతిముత్యంకు ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రోజుకు పిఎస్ 1 మొదటి వారం పూర్తి కాకపోయినా రెండు రోజులు ఆగితే చాలు ఫస్ట్ వీక్ అగ్రిమెంట్లు పూర్తవుతాయి కాబట్టి థియేటర్లు ఫ్రీ అవుతాయి.మొత్తానికి పొన్నియన్ సెల్వన్ ఫలితం టాలీవుడ్ కు అనుకూలంగానే మారిందని చెప్పాలి. దసరా బరిలో దిగే చిత్రాలకు ఇది సానుకూలాంశం. కాకపోతే మణిరత్నం మూవీకి కలిగిన అడ్వాంటేజ్ ఒకటి లేకపోలేదు. ఏపి తెలంగాణలో స్కూల్స్ కాలేజీల సెలవులు సెప్టెంబర్ 26 నుంచే మొదలయ్యాయి. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ దాకా ఇవి కొనసాగనున్నాయి. అంటే పండగ రోజు వరకు జనానికి ఉన్న పెద్ద ఆప్షన్ పొన్నియిన్ సెల్వన్ 1 ఒకటే. అయితే మన దగ్గర వసూళ్లు ఎలా ఉన్నా కూడా తమిళనాడు, కేరళలో మాత్రం రికార్డులు ఖాయమేనట.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS1