ఎంతోమంది దర్శకనిర్మాతలు మంచి లవ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తాము అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఆ సినిమా పేరు వినిపించిందంటే చాలు సినిమాలోని మంచి లవ్ స్టోరీని ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు.. ఇక ఇలాంటి లవ్ స్టోరీస్ ఎప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ గానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆషికి. చిన్న సినిమాగా వచ్చి ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా కాదు అని చెప్పాలి.


 ఈ సినిమా పాటలతో ప్రేక్షకులను మైమరిపించడమే కాదు అటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో అందరినీ కట్టిపడిస్తుంది అని చెప్పాలి. ఇక ఇదే సినిమాకు సీక్వల్ గా ఆషికి 2 వచ్చింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆషీకీ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ అదిరిపోయే లవ్ స్టోరీ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాన్స్ కొట్టేసిందన్న ప్రచారం ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా ఆషీకీ 3 తెరకెక్కుతుండగా ఇందులో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందట.


 ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహించబోతున్నారు అన్నది తెలుస్తుంది. 1990లో ఆశికి సినిమా రాగా..2013లో ఆశికి 2 సినిమా వచ్చింది. ఇకపోతే ఇప్పటికే రష్మిక మందన్న గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ లాంటి సినిమాల్లో నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి అంటే చాలు ఇక రష్మిక మందన్న బాలీవుడ్ లో సెటిల్ అయిపోవడం ఖాయం అన్నది మాత్రం తెలుస్తుంది. ఇక ఇటీవల అందాల ఆరబోత కూడా కాస్త ఎక్కువగానే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని కొన్ని సార్లు అందాల ఆడబోత మితిమీరిందంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: