ప్రముఖ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ చాలా త్వరగా పరిశ్రమలో ఎదిగారు. సైన్మా అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో వెలుగులోకి వచ్చిన రాహుల్ కి అర్జున్ రెడ్డి మూవీ తో బ్రేక్ ఇచ్చింది.

అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో ఆయన  చాలా బాగా ఆకట్టుకున్నారు. స్టార్ కమెడియన్ గా ఎదిగిన రాహుల్ రామకృష్ణ బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు చిత్రాల్లో హీరోకి సమానమైన క్యారెక్టర్స్ చేశాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ వివాదాస్పద ట్వీట్స్ వేస్తూ ఉంటాడు.

బాల్యంలో తాను లైంగిక వేధింపులు గురయ్యానని ఒకసారి ట్వీట్ చేశారు. మరోసారి సారి సినిమాలు మానేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే... ఇంత లగ్జరీ లైఫ్ ఎవడైనా వదులుకుంటాడా? అబద్ధం చెప్పానని మరో ట్వీట్ వేశాడు. ఇలా తిక్క తిక్కగా, వివాదాస్పదంగా ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. కాగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జాతిపితను కించపరిచేలా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ లో రాహుల్... గాంధీజీ గొప్పవారని నేను అసలు అనుకోవడం లేదు' అని కామెంట్ పోస్ట్ చేశారు. ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక నెటిజెన్స్ ఓ రేంజ్ లో రాహుల్ పై  బారి యుద్ధానికి దిగారు. బండ బూతులతో రెచ్చిపోయారు. గాంధీ జయంతి నాడు మందు దొరకదు కదా.. రాహుల్ కి పిచ్చి లేచి ఇలాంటి ట్వీట్స్ వేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఎందరో పూజించే జాతిపితను జయంతి నాడు కించపరచటం సబబు కాదు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఆ ట్వీట్ వెంటనే డిలీట్ చేశారు. కెరీర్ చక్కగా సాగుతుండగా రాహుల్ అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నాడు. ఇదే కొనసాగితే మనోడి కెరీర్ గోవింద అంటు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: