ఈ పండుగకు చాలా మంది పిల్లలు క్రాకర్స్ కాల్చుకోడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే చిన్న పిల్లలకి దీపావళి అంటే చాలా ఇష్టమైన పండుగ. దాని కోసం చాలా మంది చిన్న పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే చాలా మంది పిల్లలకు క్రాకర్స్ కొనుక్కునే స్థోమత కూడా ఉండదు.
కొంతమంది దీపాలు వెలిగించి దానిలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. అయితే అలాంటి పిల్లల కోసం అల్లు అర్జున్ ఎప్పటినుండో ఒక పని చేస్తూ వస్తున్నాడట. అల్లుఅర్జున్ ఆ పనిని తన మొదటి సంపాదన వచ్చినప్పటినుండే చేయడం అలవాటు చేసుకున్నారట. అదేంటంటే..అల్లుఅర్జున్ పేద పిల్లలకు, అనాధ పిల్లలకు దీపావళి రోజున క్రాకర్స్ పంచుతూ వాళ్లు పడే ఆనందాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తారట. ఇక ఈ సారి దీపావళికి కూడా అనాధ పిల్లలకు పేదవాళ్లకు క్రాకర్స్ పంచాలని నిర్ణయించుకొని రోడ్డుపై ఎవరు లేకుండా ఉన్న అనాధ పిల్లలకు అలాగే అనాధ శరణాలయాల కు వెళ్లి క్రాకర్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు కోట్లకొద్దీ ఆస్తులు ఉన్నా కూడా వారు ఎలాంటి దానం కూడా చేయరు. కానీ ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఇలా పేదవాళ్లకు గురించి పేద పిల్లల గురించి ఆలోచించి వారి ఆనందాన్ని చూసి హీరోలు మురిసిపోతూ ఉంటారు.ఇలా ప్రతి ఏడాది అల్లు అర్జున్ చాలా మంది పిల్లలకు క్రాకర్స్ కొనిస్తారట. ఇక ఈ సారి దీపావళి కి కూడా అదే పని చేయబోతున్నారట. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు అల్లు అర్జున్ నిజంగా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి