టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మీనాకు ప్రేక్షకుల లో ఊహిం చని స్థాయి లో క్రేజ్ ఉంది. మీనా హీరోయిన్ గా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
వెంకటేష్ మీనా కాంబినేషన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించి మీనా పాపులారిటీని అంతకంతకూ పెంచుకోవడం గమనార్హం.

తమిళనాడు స్థిరప డిన తెలుగు కుటుంబంలో మీనా జన్మిం చారు. మీనా తండ్రి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేశారు. మీనా తల్లి రాజ మల్లిక కూడా నటి కావడం గమనార్హం. దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన మీనా కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు మీనా స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.

అయితే మీనా తన తల్లి వల్ల కొన్ని మంచి సినిమాల లో నటించే అవ కాశం వచ్చినా ఆ అవకాశాన్ని వదులుకున్నారు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రలో నటించే అవకాశం మొదట మీనాకు దక్కింది. అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో మీనా తల్లి ఆ పాత్ర చేయవద్దని మీనాకు సూచనలు చేసింది.

నరసింహ సినిమా లో మీనా నటించి ఉంటే మాత్రం ఆ సిని మా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నటిగా మీనా కు ఊహించని స్థాయిలో మంచి పేరును తెచ్చిపెట్టింది. మీనా ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మీనా ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నసంగతి తెలిసిందే. నరసింహ సినిమా వద్దని చెప్పి మీనా తల్లి ఆమె కెరీర్ ను నాశనం చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: