అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదలయ్యే వరకు కూడా ఎవరికీ తెలియదు గీతూ రాయల్ అంటే ఎవరు? పుష్ప సినిమా తర్వాత కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత కొన్ని వారాల్లోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని తగ్గించుకుంది.అయితే బహుశా తన పాపులారిటీని పెంచుకోవడం కోసమే బిగ్ బాస్ షోలో పాల్గొని బిగ్ బాస్ కు వ్యతిరేకంగా ప్రవర్తించిందని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక  ఈ క్రమంలోని గీతూ రాయల్ కూడా ఇతర కంటెస్టెంట్లకు భిన్నంగా అడుగులు వేస్తూ తన కెరియర్ కొనసాగించింది.

ఇకపోతే  9 వారాలపాటు హౌస్ లో లేడీ శివంగిలా పోరాడిన గీతూ రాయల్ ఎట్టకేలకు ఎలిమినేట్ అయినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . అయితే ఇక  ఈమె అతివల్లే బిగ్ బాస్ షో కి ఓకింత డామేజ్ కూడా జరిగిందని చెప్పవచ్చు..అయితే కొంతమంది నెటిజన్స్ గీతూ ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పటినుంచి బిగ్ బాస్ షో చూస్తామంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులలో ఆమెపై ఏ స్థాయిలో నెగెటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ షో గీతూ రాయల్ కెరియర్ కు మైనస్ అయిందని చాలామంది కూడా కామెంట్లు చేస్తున్నారు .

అయితే .ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఆమె చేసిన తప్పులే కారణమని కూడా కొంతమంది చెబుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు ముఖ్యంగా అన్ని తనకే తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో గీతూ రాయల్ ఈ పరిస్థితిని తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉండగా 9 వారాలపాటు బిగ్బాస్ హౌస్లో ఉన్నందుకుగాను గీతూ రాయల్ కి ఎంత పారితోషకం ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.ఇకపోతే గీతూ రాయల్ తొమ్మిది వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో గడిపారు.ఇక  వారానికి రూ.25 వేల చొప్పున గీతు రాయల్ కు పారితోషకం ఇచ్చారని సమాచారం.అయితే  దీన్ని బట్టి చూస్తే 9 వారాలకు గాను గీతూ రాయల్ కు కేవలం రూ.2.5 లక్షల పారితోషికం మాత్రమే అందిందని తెలుస్తోంది.అయితే  ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో మిగతా కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే ఈమెకు చాలా తక్కువ పారితోషకం దక్కిందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: