లేడీస్ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమా తర్వాత తమిళంలో నటిస్తున్న చిత్రం కనెక్ట్. ఈ చిత్రాన్ని అశ్విన్ శరవరణన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని నయనతార భర్త విగ్నేష్ నిర్మిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. కేవలం ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి అయితే ఈ టీజర్ ని విడుదల చేయక... అందరిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంటోంది ఈ టీజర్.



టీజర్ విషయానికి వస్తే.. ఒక అమ్మాయి తనని విడిపించమని డోర్ కొడుతున్న విజువల్స్ తో డార్క్ చీకట్లో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత నయనతారను.. అనుపంఖేర్ గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చివరికి ఆ గదిలో ఉన్న రూపాన్ని చూసి ఒక్కసారిగా నయనతార భయాందోళనకు గురవడం లాంటి సన్నివేశాలు ఈ టీజర్ కు మరింత ఉత్కంఠాన్ని తెచ్చిపెట్టాయి. విచిత్రమైన రూపంలో చీకట్లో కనిపిస్తున్న ఆకారం వెన్నులో వణుకు పుట్టించేలా కనిపిస్తోంది. ఇందులో సత్యరాజ్.. వాన సినిమా నటుడు వినయ్ రామ్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.


కీలకమైన అమ్మాయి పాత్రలో హానియా నాఫిస్ నటిస్తున్నది.తన పాత్ర ఈ సినిమాకు కీలకమైనట్లుగా తెలుస్తోంది. ఇక 2015లో నయనతార ,డైరెక్టర్ అశ్విన్ దర్శకత్వంలో మాయ అనే చిత్రంలో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఒళ్ళు వణుకు పుట్టేలా ఈ సినిమా ఉంటుందని ఈ టీజర్ తో స్పష్టం అవుతోంది. అనుపమఖేర్ చాలా సంవత్సరాల తర్వాత తమిళంలో నటిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: