నవంబర్ నెలలో ఇప్పటికే అనేక తెలుగు మూవీ లు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే క్లీన్ హిట్ గా నిలిచాయి. ఈ సంవత్సరం నవంబర్ నెలలో థియేటర్ లలో విడుదల అయ్యి క్లీన్ హీట్ గా నిలిచిన మూడు సినిమాల వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధానపాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించారు.

మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. సంగీత ప్రధాన పాత్రలో తలకెక్కిన హార్రర్ జోనర్ మూవీ మసుద నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో డీసెంట్ కలెక్షన్ లభించాయి. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలిచింది.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ తాజాగా గాలోడు అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కూడా ఇప్పటికే జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇలా నవంబర్ నెలలో ఈ 3 మూవీ లు ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: