ఈవారం విడుదలకు రెడీగా ఉన్న సినిమా లలో తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న సినిమా హిట్ ది సెకండ్ కేస్. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు అంతలా అంచనాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో , హిట్ 2 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  ఇది ఇలా ఉంటే హిట్ 1 మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా ,.  హిట్ 2 లో అడవి శేషు హీరో గా నటించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించాడు. మీనాక్షి చౌదరిమూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించింది. డిసెంబర్  2 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. 

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా చిత్ర బృందం లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల నడువితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా హిట్ 2 మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా నుండి పోరాటమే అనే లిరికల్ వీడియో సాంగ్ రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఏ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: