రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెండవ షెడ్యూల్ ను మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ రెండవ షెడ్యూల్ ను డిసెంబర్ 8 వ తేదీ నుండి ప్రారంభించ బోతున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రభాస్ సరసన నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లను సెలెక్ట్  చేసుకున్నారు. అలాగే సంజయ్ దత్ కూడా ఈ మూవీ లో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే పేరును మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఒకే సెట్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం ఇప్పటికే ఒక మూత బడిన థియేటర్ ను చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు , ఆ థియేటర్ ను మార్పులు చేర్పులు చేసి ఇందు లోనే ఎక్కువ శాతం షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు మారుతి చాలా స్పీడ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని హర్రర్ కామెడీ నేపథ్యంలో మారుతి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: