సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్  అనిరుద్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన పాటలను పాడి మరింత అభిమానులను సొంతం చేసుకున్నారు.. అందుకే సింగర్ అనిరుద్ అంటే చాలామందికి ఎనలేని అభిమానం.. ఈయన తన పాటలతో శ్రోతలను అలరిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నాడు.  సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లు , సింగర్లుగా కొనసాగడం చాలా కష్టం. కానీ ఈయన ఒకవైపు పాటలు పాడుతూనే.. మరొకవైపు ఆ పాటలకు సంగీతాన్ని అందిస్తూ ఉంటాడు.

ఇటీవల సంగీత దర్శకత్వం వహించిన విక్రం, తిరు సినిమాలు మ్యూజిక్ పరంగా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  దీంతో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ పై కూడా ఇటీవల పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా అనిరుధ్ తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేయాలని డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.  నిజానికి ఆయనది లక్కీ హ్యాండ్ లేక ఆయన మ్యూజిక్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నాతో తెలియదు కానీ ప్రస్తుతం ఏ స్టార్ హీరో నోట విన్న అనిరుధ్ పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రోజుల్లో తమిళ్ మరియు తెలుగులో కొత్త పెద్ద స్టార్ హీరోల చిత్రాలు ప్రకటించినప్పుడల్లా డిఫాల్ట్ గా అనిరుద్  న్యూ ఏజ్ రాక్ స్టార్ అంటూ ట్రెండింగ్ జాబితాలోకి వస్తున్నాడు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా లేక డిఫాల్ట్ గానీ ట్రెండింగ్ జాబితాలోకి వస్తోందా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఆయనకి ఉన్న క్రేజ్ వల్లే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ జాబితాలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.  మరి ఇప్పుడు ఏ హీరో సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: