ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్గా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. విలన్గా రావణాసుర పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించి.. ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. కానీ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా పిల్లలు ఆడుకునే బొమ్మలు లాగా పాత్రలు ఉన్నాయి అంటూ విమర్శలు కూడా ఎదుర్కొంది.


ఈ క్రమంలోని సినిమా విడుదలను ఆలస్యం చేస్తూ వస్తున్నారు చిత్రబృందం.  ఇక వీఎఫ్ఎక్స్ పనులలో బిజీగా ఉన్న చిత్ర బృందం కేవలం ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గడ్డం కోసమే రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమా వీ ఎఫ్ ఎక్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని కూడా సమాచారం. అయితే రోజురోజుకు ఇలా నిర్మాణాంతర పనులు పెండింగ్లో ఉండడం వల్ల సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులే కాదు దేశ ప్రజలు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఆలస్యం చేయడం సినిమాకి వరం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకెళితే 2024 జనవరి ఒకటవ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంతో దేశం మొత్తం హిందుత్వమూడులో ఉంటుంది.  అలాంటి సమయంలో సంక్రాంతి కానుకగా స్లాట్ ను ఫిక్స్ చేసుకొని సినిమా విడుదల చేస్తే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని డేట్ లాక్ చేసుకోబోతున్నారు నిర్మాతలు. మరి వారి ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: