ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న షో అర్ధంతరంగా ఆగిపోతే బుల్లితెరకి ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతివారం ఆ షో చూస్తే కానీ పడుకోని ప్రేక్షకులకు అసలు నిద్రనే పట్టదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ షో ఆగిపోయిన తర్వాత కూడా బుల్లితెర ప్రేక్షకుల పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుమ తన వాక్చాతుర్యంతో క్యాష్ షో కి కొత్త హంగులు దిద్దింది.


 ఈ క్రమంలోనే అన్ని షోలకంటే  కంటే టాప్ రేటింగ్ సొంతం చేసుకునేలా తన స్పాంటేనియస్ పంచులతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక ఈ కార్యక్రమం వస్తుందంటే చాలు అటు బుల్లితెర ప్రేక్షకులు  ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి టీవీకి అతుక్కుపోతూ ఉంటారు. ప్రతివారం నలుగురు సెలబ్రిటీలను గెస్ట్ లుగా  పిలిచి వారితో సుమ ఆడించే ఫన్నీ టాస్కులు అందరికీ తెగ నచ్చేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పంచే షో  ఇటీవల అర్థాంతరంగా ఆగిపోయింది.


 ఇక సుమ క్యాష్ షో అనే కార్యక్రమాన్ని ఆపేసి సుమ అడ్డ అనే కొత్త షోని ప్రారంభించారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ క్యాష్ షో అర్ధాంతరం గా ఆపేయడానికి కారణం ఏంటి అన్న విషయంపై మాత్రం బుల్లితెర ప్రేక్షకులు అందరూ కన్ఫ్యూజన్లో మునిగిపోయారు. అయితే సుదీర్ఘకాలంగా ఈ షో కొనసాగుతున్న కారణంగానే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారని షో ఆపేసారట. అంతేకాదు ప్రతివారం నలుగురు గెస్టులను పిలవాలి. ఇటీవల కాలంలో వచ్చిన వారే మళ్లీమళ్లీ షోలో కనిపిస్తున్నారు. కొత్తవారిని వెతికి పట్టుకొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకే కొన్నాళ్లపాటు క్యాష్ షోకి బ్రేక్ ఇవ్వాలని మల్లెమాల యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: