సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ జీవితాల గురించి తెలుసుకోవడానికి తమ అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతూ  ఉంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఏవైనా ఎఫైర్ లు ఉన్నాయా లేదా వారి మధ్య ఎలాంటి సన్నిహిత్యం ఉంది అన్న విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతూ ఉంటారు వారి అభిమానులు. అంతేకాదు చాలామంది అభిమానులు తమ అభిమాన హీరో ఎలాంటి కారు వాడుతున్నాడు తమ అభిమాన హీరోయిన్ ఎంత కాస్ట్లీ నగలను ధరిస్తుంది అలాంటి విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. 

అయితే ఈ మధ్యకాలంలో మాత్రం హీరోలు లేదా హీరోయిన్లు ఎలాంటి జాకెట్లను ధరిస్తున్నారు దాని బ్రాండ్ ఏంటి దాని ఖరీదు ఎంత ఉంటుంది అని తెగ ఆరా తీస్తున్నారు తమ అభిమానులు.అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ ధరించిన ఒక వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ధరించిన వాచ్ ద్వారా ఏకంగా నాలుగు కోట్ల 75 లక్షలు అంటూ కొందరు సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది.ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా షారుఖ్ ఖాన్ వివిధ సందర్భాలలో  వాచీలు పెట్టుకోవడం మనం చూసాం.

అయితే తాజాగా షారుక్ ఖాన్ బ్లూ సిరామిక్ ఏపీ పర్మినెంట్ క్యాలెండర్ వాచ్ ని పెట్టుకోవడం సదరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక యూజర్ షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ధర 4.75 కోట్లు రూపాయలు అంటూ పేర్కొన్నారు. ఇక  ఈ వాచ్ గత సంవత్సరం ఆగస్టులో విడుదలైంది. అంతేకాదు షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ యు ఎస్ ఏ అనే వెబ్సైట్ ప్రకారం ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ అని షారుఖ్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచ్ లలో ఒకటి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఆ వాచ్ లో చిన్న ముళ్ళు పెద్ద ముల్లులపై 18 క్యారెట్ల బంగారం తాపడం చేసి ఉంటుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది అభిమానులు స్పందిస్తూ ఈ వాచ్ సమయాన్ని చూపించడంతో పాటు భవిష్యత్తును కూడా చెబుతుందా అంటూ కామెంట్లను సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: