బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత సెన్సేషన్  సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసింది.  ఇక ఈ సినిమా చూసి బాలయ్య అభిమానులు అందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయారు అని చెప్పాలి.  అయితే ఇక ఈ సినిమాను అప్పట్లో హిందీలో కూడా విడుదల చేస్తారని ఎంతోమంది భావించారు. అయితే ఇక ఈ సినిమా హిందీ విడుదలకు సంబంధించిన హక్కులను కూడా కొనుగోలు చేశారు. కానీ ఇలా హక్కులు కొన్న వారు తర్వాత సైలెంట్ అయిపోయారు.


 ఈ సినిమా హిందీ హక్కులను కొనుగోలు చేసింది ఎవరో కాదు ప్రస్తుతం చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న పెన్ మూవీస్ అధినేత జయంతి లాల్. హక్కులను కోట్లు పెట్టి కొన్నప్పటికీ ఈ సినిమాను మాత్రం విడుదల చేయలేదు. అయితే అనూహ్యంగా  ఇప్పుడు జనవరి 20వ తేదీన ఈ సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేశారు అని చెప్పాలి . అంతేకాదు పివిఆర్ సినిమాస్తో ఒప్పందం కుదుర్చుకుని ఇక పివిఆర్ థియేటర్లు అన్నిచోట్ల కూడా 99 రూపాయలకే సినిమాను చూసే అవకాశాన్ని కల్పించారు.


 అయితే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పటాన్ సినిమాను ఢీకొట్టేందుకు బాలయ్యేనే రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. పటాన్ సినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సహా తమిళ హిందీ భాషల్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు కౌంటర్ గానే అఖండ సినిమాను రిలీజ్ చేశారు అనే వాదన తెర మీదకి వచ్చింది. పఠాన్ సినిమా పై గత కొన్ని రోజులుగా నెగెటివిటీ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను విడుదల కానీవ్వం అంటూ ఎంతోమంది నిరసనలు కూడా చేశారు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా అటు బాలయ్య సినిమాను థియేటర్లలో విడుదల చేయడమే కాదు.. తక్కువ ధరకే ఇక టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: