మహేష్ బాబు బావగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుధీర్ బాబు. మొదటి సినిమా "ఎస్ ఎమ్ ఎస్" తోనే మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సుధీర్ బాబుకు బెస్ట్ డెబ్యూ హీరోగా అవార్డు ను సైతం అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు... ప్రేమకథాచిత్రం తో ఒక్కసారిగా టాలీవుడ్ దర్శక నిర్మాతలను తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ సినిమా అప్పట్లో హారర్ కామెడీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచింది. అలా తన కెరీర్ లో నిన్నటి వరకు మొత్తం 17 సినిమాలు చేశాడు.

అందులో సుధీర్ బాబుకు బాగా పేరు తెచ్చినవి నాలుగు సినిమాలే... వాటిలో ఎస్ ఎమ్ ఎస్ , ప్రేమకథాచిత్రం , సమ్మోహనం మరియు శ్రీదేవి సోడా సెంటర్ లు ఉన్నాయి. అయితే సినిమా సినిమాకు సుదీర్ బాబు నటన పరంగా మెరుగవుతున్నా ఎందుకో హిట్ సినిమాలు తనకు రావడం లేదు. అయితే ఎంతో నమ్మకంతో ఒక రీమేక్ సినిమాను "హంట్" అనే పేరుతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమా పదేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన ముంబై పోలీస్ కు రీమేక్ అని తెలిసిందే. ఇందులో సుధీర్ బాబు ఏసీపీ గా మరియు ప్రేమిస్తే భరత్ శ్రీకాంత్ లు తన సహద్యోగులుగా నటించారు. తోటి ఆఫీసర్ హత్య కేసు ను చేధించడమే సినిమా కథ.

అయితే ఈ సినిమాను ఏ విధంగా డైరెక్టర్ మహేష్ మలిచాడన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు రివ్యూలు మరియు పబ్లిక్ టాక్ ను బట్టి చూస్తే ఈసారి కూడా సుధీర్ బాబు కు హిట్ దక్కడం కష్టమే అని తెలుస్తోంది. సమ్మోహనం తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఇంకా ఎదురుచూపులు తప్పేలా లేవు. మరి సినిమా లాంగ్ రన్ లో కలెక్షన్ లో ఏ మేరకు వస్తాయన్నదానిపైనే యావరేజ్ లేదా ప్లాప్ అన్నది డిసైడ్ చేయచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: