టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన చాలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ రెండు వారాలు పూర్తయ్యాయి. అంటే సుమారుగా 14 రోజుల పాటు  థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మొదటి రోజు పాతిక కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు నుంచి 10 కోట్ల లోపే కలెక్షన్లు రాబడుతూ వస్తుంది.ఈ సినిమా సుమారు 8 రోజులపాటు కోటికి పైగా కలెక్షన్లు రాబట్టినా 9వ రోజు నుంచి కోటి లోపు కలెక్షన్లకు పడిపోయింది. ఇక మళ్లీ 11వ రోజు నుంచి 1కోటి 44 లక్షలు వసూలు చేసినా కూడా పోటీగా వీరయ్య సినిమా ఇంకా 14వ రోజున పఠాన్ సినిమా ఎంట్రీతో బాలయ్య సినిమాకి చాలా దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి.


14 వ రోజున ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కేవలం 8 లక్షలు మాత్రమే  వసూలు చేసింది. ఇక టోటల్ గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 రోజులకు గాను మొత్తం 64 కోట్ల 90 లక్షల షేర్ ఇంకా 105 కోట్ల 5 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది ఈ సినిమా.ఇక 14 రోజులకు గాను 4 కోట్ల 77 లక్షలు వసూళ్లు కర్ణాటకతో పాటు మిగతా ఏరియాలో ఇంకా ఓవర్సీస్ లో 5 కోట్ల 73 లక్షల రాబట్టి ఇక ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా 75 కోట్ల 45 లక్షల షేర్ ఇంకా అలాగే 126 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది.ఇక 73 కోట్లకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో 74 కోట్లకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగగా.  ఆ టార్గెట్ పూర్తి చేసి ఈ సినిమా ఇప్పుడు 1 కోటి 40 లక్షల ప్రాఫిట్ లోకి వెళ్లింది. పఠాన్ సినిమా ఎంట్రీ ఇచ్చి హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టగా బాలయ్య సినిమా వసూళ్లలో డ్రాప్ కనిపించడంతో ఇక మీదట వసూళ్లు వచ్చే అవకాశం తక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: