తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరైన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా వారు స్ట్రీమింగ్ చేయనున్నారు. అందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం చేయబడింది. మొదటి ఎపిసోడ్లో భాగంగా పవన్ కళ్యాణ్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. అయితే మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను డైరెక్టుగా అడిగేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన విజువల్ కూడా మనం ఇప్పటికే ప్రోమోలో చూసాం.

కేవలం సినిమా వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు రాజకీయ అంశాలపై కూడా బాలకృష్ణ చర్చించడం జరిగింది. 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన సంగతి గురించి కూడా బాలయ్య గుర్తు చేస్తూ అసలు విషయం ఏమిటో చెప్పమని అడిగారు. మధ్యలో సాయి ధరంతేజ్ కూడా ఎంట్రీ ఇచ్చి ఎపిసోడ్కి హైలెట్గా నిలిచారు.  అంతేకాదు ఈ షో ఎపిసోడ్ స్పెషల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కోసం సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు తాను కూడా ఉన్నాను అంటూ చెబుతోంది.

రెండవ భాగంలో సందడి చేయబోతుందని ముఖ్యంగా బాలయ్యతో , పవన్ కళ్యాణ్ తో ముచ్చటించనున్నట్లు సమాచారం.  హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర గురించి మాత్రమే కాకుండా ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా ఆమె బాలయ్యతో పంచుకోబోతుందట.  మొత్తానికి అయితే అన్ స్టాపబుల్ షో ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇలా ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు నిర్వాహకులు. మొత్తానికైతే ఈ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో సీజన్ 2 కూడా పూర్తి కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: