తెలుగు ఇండస్ట్రీ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ హవా నడుస్తుంది. ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.అందుకోవడమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ వస్తుండడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా బిజీగా మారిపోయారు.

తాజాగా థమన్ సంగీతం అందించిన  చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది. ఇక ఈయన త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా పని చేస్తున్నారు.

అలాగే శంకర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఇలా థమన్ ప్రతిసారి ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువస్తూ తనపై ప్రశంసలు కురిపించడానికి గల కారణం ఏంటి అనే సంగతికి వస్తే… గతంలో ఎన్టీఆర్ బృందావనం సినిమా షూటింగ్ సమయంలో రెండు పాటలు కంపోజ్ చేయగా వంశీ వాటిని ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్లారట.

ఒకవేళ ఈ పాటలు కనుక నచ్చితే థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుందామని అనుకున్నారట.. ఎన్టీఆర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం  కనుక ఆయన పెద్దగా వాల్యూం పెట్టుకొని మరి పాటలు విన్నారు.ఇలా నేను కంపోజ్ చేసిన పాటలు వింటూ మధ్యలోనే ఆపివేసి నా గురించి అడిగి మరి తెలుసుకున్నారు.తరువాత నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడగడంతో వెంటనే నేను కళ్ళనిండా నీళ్లతో ఎన్టీఆర్ వద్దకు వెళ్లానని థమన్ తెలిపారు. ఆరోజు ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసిన సంఘటన నా జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేను.

సాధారణంగా అవకాశాల కోసం మనమే ఎన్నో కఠిన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ నన్ను పిలిచి స్వయంగా అవకాశం ఇప్పించడం నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని సంఘటన. ఈ విషయంలో తాను ఎన్టీఆర్ కి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానని తెలిపారు.అందుకే ఆయనకు ఫ్లాప్ మ్యూజిక్ అస్సలు ఇవ్వలేను ఆయన సినిమాలకు 200% న్యాయం చేసేలా నేను బాగా పని చేస్తాను. తారక్ ఎప్పుడు నా గుండెల్లో ఉంటారంటూ కూడా థమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: