తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్ గా కొనసాగుతున్న బ్రహ్మానందం కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా అయితే కమెడియన్స్ తమ డైలాగులతో ప్రేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మానందం ఇంతలా కష్టపడాల్సిన పనిలేదు. కేవలం బ్రహ్మానందం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు అందరూ కూడా పగలబడి నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 అంతలా తన హావభావాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు బ్రహ్మానందం. ఇక హాస్య బ్రహ్మగా అరుదైన బిరుదు కూడా అందుకున్నాడు అని చెప్పాలి. కొన్ని కొన్ని పాత్రలు అయితే కేవలం బ్రహ్మానందం కోసమే పుట్టాయేమో.. ఆయన తప్ప ఇక ఆ పాత్రను మరొకరు చేయలేరేమో అనిపించేంతల ప్రాణం పోశారు బ్రహ్మానందం. అంతేకాదు ఇక సినిమాలో హీరో హీరోయిన్లు ఉన్నప్పటికీ కేవలం కీలకపాత్రలో నటించిన బ్రహ్మానందం పంచిన కామెడీ కారణంగానే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.


 ముఖ్యంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోసాడు బ్రహ్మానందం. ఇలా యావరేజ్ కంటెంట్ తో వచ్చినప్పటికీ బ్రహ్మానందం కామెడీ కారణంగా హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ, రెడి, కింగ్ సినిమాల్లో సక్సెస్ లో బ్రహ్మానందం పాత్ర కీలకంగా ఉంది. బాద్షా, నమో వెంకటేశ సినిమాలు కూడా బ్రహ్మానందం కామెడీ టైమింగ్ కారణంగానే ఆడాయ్ అని చెప్పాలి.  వినాయక్ డైరెక్షన్లో వచ్చిన కృష్ణ, అదుర్స్, అల్లుడు శ్రీను సినిమాల్లోనూ బ్రహ్మానందం కామెడీని ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం కూడా అంతే. ఇక ఆ తర్వాత కిక్, వెంకీ, దుబాయ్ శీను, విక్రమార్కుడు, జాతీయ రత్నాలు కూడా బ్రహ్మానందం కామెడీ హైలెట్ అవడంతోనే హిట్గా నిలిచాయి. జల్సా, మన్మధుడు, జులాయ్, అత్తారింటికి దారేది, బావగారు బాగున్నారా సినిమాలు కూడా బ్రహ్మానందం కామెడీ టైం ఎంతోనే హిట్ అయ్యాయని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: