యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లోనే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీగా రూపొందిపోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 30 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గ నటించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ ని దర్శకుడు శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి 9 భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... సెప్టెంబర్ నుండి ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సంబంధించిన సెట్ వర్క్ పనులు స్టార్ట్ కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకులలో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ... ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పనులు పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: