
సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి రెండు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. నాన్ బాహుబలి రికార్డ్స్ నెలకొల్పయి. ఆ టైంలో థమన్ అలవైకుంఠపురంలో సినిమా సక్సెస్ మీట్ ఫంక్షన్ లో నోరు అదుపు తప్పి ఇండైరెక్టుగా సరిలేరు నీకెవ్వరూ సినిమాపై సెటైర్ వేశాడు. అయినా కానీ మహేష్ ఫ్యాన్స్ సహించారు. మహేష్ కూడా తన సర్కారు వారి పాట సినిమాకి థమన్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో కేవలం రెండు పాటలు తప్ప ఏవి ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగ్గా ఇవ్వలేదు థమన్. ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక తాజాగా మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని మహేష్ ఏమో కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే తాజాగా థమన్ ఒక ట్యూన్ రెడీ చేసి త్రివిక్రమ్ కి మహేష్ కి వినిపించగా అది వాళ్లకి నచ్చలేదట. ఆ విషయం మహేష్ బాబు ఫ్యాన్స్ కి తెలిసి థమన్ ని ఓ రేంజిలో ట్రోల్ చేస్తూ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. థమన్ ని సినిమా నుంచి తీసేయండి అని హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి ట్విట్టర్ లో నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.