తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నాగ చైతన్య ఇప్పటికే తమిళ క్రేజీ దర్శకుడు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ లో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో అరవింద స్వామి , ప్రియమణి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ క్రేజీ మూవీ కి ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. కెరీర్ లో మొట్ట మొదటి సారి నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: