రామ్ చరణ్ సినిమా కెరియర్ లో నే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచిన చిత్ర ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు..

ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ లవర్ బాయ్ తరహాలో నే ఉంటుంది. ప్రేమకి లైఫ్ స్పాన్ తక్కువ అని అది ఒక టైమ్ దాటాక  తగ్గిపోతుంది అని చెబుతూ కొంతకాలం ప్రేమిస్తా అంటూ చెబుతూ ఉంటాడూ చరణ్..

ప్రేమ కథని అంత ముందు వరకు ఎవరూ కూడా చెప్పని కోణంలో ఈ మూవీలో దర్శకుడు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే రెగ్యులర్ ఆడియన్స్ కి ఆ పాయింట్ అస్సలు కనెక్ట్ కాకపోవడంతో మూవీ ప్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో నాగబాబు అప్పుల్లో మునిగిపోయాడు.. ఈ నేపధ్యంలో ఆరెంజ్ సినిమా తనని ఆర్ధికంగా అలాగే మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టింది నాగబాబు కూడా చాలా సందర్భాలలో అయితే చెప్పారు. అయితే థియేటర్స్ లో ప్రేక్షకులకి కనెక్ట్ కాని ఆ సినిమా తరువాత  బుల్లితెరలో అలాగే యుట్యూబ్ ద్వారా యూత్ లో చాలా మందికి నచ్చింది ఆ సినిమా.

ఇప్పటికి ఒక యూత్ ఆరెంజ్ సినిమాని చూడటానికి ఇష్టపడుతూ నే ఉంటారు. అయితే ఈ టైమ్ లో చేయాల్సిన సినిమాని ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే తీయడం కూడా మూవీకి పెద్ద మైనస్ అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆరెంజ్ సినిమాని ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

మగదీర సినిమాని ముందుగా రీరిలీజ్ చేయాలని అనుకున్న కానీ ఎందుకో వాయిదా పడింది. అయితే ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.. అయితే జెనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ మూవీకి మంచి ఆదరణ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: