చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ తన కెరీర్ను మొదలుపెట్టిన రకుల్ ప్రీతిసింగ్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకు కూడా డేట్లు లేవని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.అలాంటి రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం ఘోరమైన స్థితిలో ఉందని చెప్పవచ్చు. తెలుగు మరియు తమిళంలో ఆఫర్లు తగ్గినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే ఈ అమ్మడు నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.


దీంతో అక్కడ కూడా ఆఫర్లు తగ్గడం మొదలయ్యాయి. ప్రస్తుతం రకుల్ చేస్తున్న సినిమాలు ఏంటి అనే విషయం అంటే టక్కున చెప్పలేని పరిస్థితి ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా రకుల్ ప్రీతిసింగ్ చివరకు గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారం కూడా ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలిచింది.. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ ని ప్రమోట్ చేస్తూ చాలా దారుణమైన స్థితికి పడిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కమర్షియల్ యాడ్ కు రకుల్ ప్రీతిసింగ్ భారీ గానే రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయినా కూడా ఈమె తీరును చాలామంది తప్పుపడుతున్నారు ఆఫర్స్ లేకపోతే ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ కి వ్యవహరించాల్సిన అవసరం ఏముంది అంటూ పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ఆన్లైన్ రమ్మిని కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ చేయడం కూడా జరిగింది మరి కొన్ని రాష్ట్రాలలో అనధికారికంగా బ్యాన్ కొనసాగుతూనే ఉంది. ఇలా బ్యాన్ విధించిన వాటిని కొంతమంది దొంగచాటుగా ఆడేస్తున్నారు.పూర్తిగా ఆన్లైన్ రమ్మి నుండి యువత బయటపడేందుకు పలువురు సెలబ్రిటీలు ప్రయత్నం చేయాలి కానీ ఇలా ప్రోత్సహిస్తే ఎలా అంటూ అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: