తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానా న్ని సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి ఎంతో గొప్ప గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది .

 ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం కీర్తి ... నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన మహానటి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సావిత్రి పాత్రలో నటించింది. ఈ పాత్ర ద్వారా కీర్తి కి అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తిమూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది .

తాజాగా కీర్తి "మహానటి" మూవీ లోని సావిత్రి పాత్ర గురించి మాట్లాడుతూ ... మహానటి మూవీ లో నటించడానికి మొదట భయపడ్డాను అని ... దర్శకుడు ఒప్పించడం తో ఓకే చెప్పినట్లు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. సావిత్రమ్మ  కు విపరీతం గా అభిమానులు ఉన్నారు. ఆ పాత్రను అంగీకరించినందుకు చాలా మంది ట్రోల్ చేశారు. సవాళ్లు ... విమర్శలు ఎదురైనప్పటికీ ఆ పాత్ర చేసి నందుకు సంతోషం గా ఉంది అని తాజాగా కీర్తి తెలియజేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి "దసరా" మూవీ లో హీరోయిన్ గా నటించింది. నానిమూవీ లో హీరో గా నటించ గా ... శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: