నాచురల్ స్టార్ నాని తాజాగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ్ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా నాని ఇండియా వ్యాప్తంగా అనేక ప్రదేశాలను తిరుగుతూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది.

మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 26 వ తేదీన సాయంత్రం 5 గంటలకు "పి వి కే"  ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ... ఆలమూరు రోడ్డు ... అనంతపూర్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది  ఇలా ఉంటే ఈ మూవీ తో నాని ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మార్చి 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: