తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో శ్రీనివాస్ తన నటన తో ప్రేక్షకులను బాగానే ఆకట్టు కోవడం ... ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ సినిమాతో శ్రీనివాస్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ యువ హీరో దక్కించుకున్నాడు. ఆఖరుగా శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నబ నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో చత్రపతి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి చత్రపతి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది.

ఇది ఇలా ఉంటే వినాయక్ కు మరియు శ్రీనివాస్ కు ఇదే మొట్ట మొదటి హిందీ మూవీ కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ కు యూట్యూబ్ లో 4.2 మిలియన్ వ్యూస్ ... 107 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: