టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో ... వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించి సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ గత కొంత కాలంగా నటించిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకోలేదు. పోయిన సంవత్సరం మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమాను మినహాయిస్తే అంతకు ముందు ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల పాటు వరుస పరాజయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం దసరా మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కలిసి నేను లోకల్ అనే మూవీ లో నటించారు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది  త్రినాద్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా నాని మరియు కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందిన నేను లోకల్ మరియు దసరా మూవీ లు రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: