ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

 కానీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో బాలకృష్ణ ... శ్రీ లీల ... కాజల్ అగర్వాల్ పై చిత్ర బృందం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ బాలకృష్ణ ... శ్రీ లీల ... కాజల్ అగర్వాల్ పై చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ లో చాలా హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: